రవ్వలడ్డు పేరు వినని తెలుగు వారు ఉండరని చెప్పవచ్చు. ఇక తెలంగాణ కుటుంబాల్లో ఈ స్వీట్ తరతరాలుగా తయారవుతున్న సంప్రదాయమైన తీపి వంటకం. అందరికీ అందుబాటులో ఉండే సాధారణ పదార్థాలతో చేసే ఈ లడ్డు రుచిలోనే కాదు, కుటుంబ అనుబంధాల జ్ఞాపకాలతో ప్రత్యేక గుర్తింపును పొందింది. ముఖ్యంగా పండుగలు, పూజలు, శుభకార్యాలు, అతిథులు వచ్చినపుడు తక్కువ సమయంలో చేసే మిఠాయిగా రవ్వలడ్డు నిలిచింది.
సంప్రదాయ రవ్వలడ్డుకు మరింత రుచి, మరియు ఆరోగ్యం కోసం క్యారెట్ తో చేద్దాం. క్యారెట్ తినని వారు కూడా ఈ లడ్డును ఎంజాయ్ చేస్తారు. మెత్తగా, నోట్లో వేసుకోగానే కరిగిపోయే రుచి.
నెయ్యి మరియు యాలకుల సువాసన కలిసి ఈ క్యారెట్ రవ్వలడ్డూలు ఒక్కసారి తింటే మళ్లీ తినాలనిపిస్తుంది.