Home / వెజ్ కర్రీస్/ 🥔హోటల్ స్టైల్ బేబీ పొటాటో కర్రీ – ఇంట్లోనే సూపర్ టేస్ట్..!

🥔హోటల్ స్టైల్ బేబీ పొటాటో కర్రీ – ఇంట్లోనే సూపర్ టేస్ట్..!

April 15, 2026 12:03 pm
|
By

రెస్టారెంట్ స్టైల్‌ బేబీ పొటాటో మసాలా కూర అంటే పిల్లలు, పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. మృదువైన బంగాళాదుంపల గ్రేవీ, మసాలాతో వచ్చే రుచి, టెక్చర్ కలిసిన ఈ కూర నాన్, రోటీ, చపాతీతో అద్భుతంగా ఉంటుంది. ఇంట్లోనే హోటల్ రుచితో సులభంగా ఎలా ఈ కర్రీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

🛒 కావలసిన పదార్థాలు:-

  • బేబీ పొటాటో (చిన్న బంగాళాదుంపలు)– 250 గ్రా
  • ఉల్లిపాయలు – 2 (సన్నగా తరిగినవి)
  • పచ్చిమిర్చి – 2
  • ధనియాల పొడి – 1 టీ స్పూన్
  • కారం పొడి – 1 టీ స్పూన్
  • గరం మసాలా – ½ టీ స్పూన్
  • పసుపు – కొద్దిగా
  • నూనె – 3 టేబుల్ స్పూన్లు
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
  • పెరుగు – 1/4 కప్పు
  • ఉప్పు – రుచికి తగినంత
  • కరివేపాకు – ఒక రెమ్మ
  • జీలకర్ర – అర టీ స్పూన్
  • కొత్తిమీర – అలంకరణకు

👩‍🍳 తయారు చేసే విధానం:-

🔸 స్టెప్ 1:  బేబీ పొటాటోలను ఉడికించి, తొక్క తీసి, పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత ఒక కడాయిలో కొంచెం నూనెను వేసి,వేడి అయిన తరువాత, బంగాళా దుంపలను వేసి కొద్దిగా వేయించి పక్కన పెట్టుకోవాలి.

🔸 స్టెప్ 2:  అదే కడాయిలో నూనె వేసి, వేడి అయిన చేసి ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే దాకా వేయించాలి. అందులో పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంతవరకు  వేయించాలి.

🔸 స్టెప్ 3: ఇప్పుడు పక్కన పెట్టిన బంగాళాదుంపలు వేసి కలిపి, కారం, పసుపు, ధనియాల పొడి, గరంమసాల, పెరుగు వేసి బాగా కలపాలి.

🔸 స్టెప్ 4: అందులోనే కొంచెం నీరు కలిపి 5–7 నిమిషాల పాటు మగ్గించాలి. చివరగా కొత్తిమీరను వేసి వడ్డించుకోవాలి.

🍽️ సర్వింగ్ సూచనలు:-

  • నాన్, పుల్కా, రోటీ, జీరా రైస్‌తో ఈ మసాల కర్రీ చాలా రుచిగా ఉంటుంది.

💡 టిప్స్ (రెస్టారెంట్ రుచి కోసం):-

  • పెరుగు బదులుగా క్రీమ్ లేదా టమాటో ప్యూరి లేదా కొంచెం కాజూ పేస్ట్ అయిన మంచి రుచి వస్తుంది
  • చివర్లో కసూరి మేతి, కాస్త బట్టర్ వేసుకుంటే రెస్టారెంట్ స్టైల్ ఫ్లేవర్ వస్తుంది.
  • బంగాళాదుంపలను ఊడించి, ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేయడంతో కర్రీ రుచి మరింత పెరుగుతుంది.