శాకాహారంవెజ్ కర్రీస్

హోటల్ స్టైల్ బేబీ పొటాటో కర్రీ – ఇంట్లోనే సూపర్ టేస్ట్

రెస్టారెంట్ స్టైల్‌ బేబీ పొటాటో మసాలా కూర అంటే పిల్లలు, పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. మృదువైన బంగాళాదుంపల గ్రేవీ, మసాలాతో వచ్చే రుచి, టెక్చర్ కలిసిన ఈ కూర నాన్, రోటీ, చపాతీతో అద్భుతంగా ఉంటుంది. ఇంట్లోనే హోటల్ రుచితో సులభంగా ఎలా ఈ కర్రీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

హోటల్ స్టైల్ బేబీ పొటాటో కర్రీ – ఇంట్లోనే సూపర్ టేస్ట్
తయారీ15 నిమిషాలు
వంట25 నిమిషాలు
మొత్తం సమయం40 నిమిషాలు
ఎంత మందికి3 మందికి
కష్టంసులువు
వంటకానికి వెళ్లండి

వంట మోడ్

హోటల్ స్టైల్ బేబీ పొటాటో కర్రీ – ఇంట్లోనే సూపర్ టేస్ట్

దశ 1 / 4

బేబీ పొటాటోలను ఉడికించి, తొక్క తీసి, పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత ఒక కడాయిలో కొంచెం నూనెను వేసి,వేడి అయిన తరువాత, బంగాళా దుంపలను వేసి కొద్దిగా వేయించి పక్కన పెట్టుకోవాలి.

కావాల్సిన పదార్థాలు
  • 250 గ్రా బేబీ పొటాటో
  • 2 ఉల్లిపాయలు
  • 2 పచ్చిమిర్చి
  • 1 టీ స్పూన్ ధనియాల పొడి
  • 1 టీ స్పూన్ కారం పొడి
  • ½ టీ స్పూన్ గరం మసాలా
  • కొద్దిగా పసుపు
  • 3 టేబుల్ స్పూన్లు నూనె
  • 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
  • 1/4 కప్పు పెరుగు
  • రుచికి తగినంత ఉప్పు
  • ఒక రెమ్మ కరివేపాకు
  • అర టీ స్పూన్ జీలకర్ర
  • అలంకరణకు కొత్తిమీర

క్లుప్తంగా

రెస్టారెంట్ స్టైల్‌ బేబీ పొటాటో మసాలా కూర అంటే పిల్లలు, పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. మృదువైన బంగాళాదుంపల గ్రేవీ, మసాలాతో వచ్చే రుచి, టెక్చర్ కలిసిన ఈ కూర నాన్, రోటీ, చపాతీతో అద్భుతంగా ఉంటుంది. ఇంట్లోనే హోటల్ రుచితో సులభంగా ఎలా ఈ కర్రీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

తయారీ విధానం

  1. బేబీ పొటాటోలను ఉడికించి, తొక్క తీసి, పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత ఒక కడాయిలో కొంచెం నూనెను వేసి,వేడి అయిన తరువాత, బంగాళా దుంపలను వేసి కొద్దిగా వేయించి పక్కన పెట్టుకోవాలి.

  2. అదే కడాయిలో నూనె వేసి, వేడి అయిన చేసి ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే దాకా వేయించాలి. అందులో పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంతవరకు వేయించాలి.

  3. ఇప్పుడు పక్కన పెట్టిన బంగాళాదుంపలు వేసి కలిపి, కారం, పసుపు, ధనియాల పొడి, గరంమసాల, పెరుగు వేసి బాగా కలపాలి.

  4. అందులోనే కొంచెం నీరు కలిపి 5–7 నిమిషాల పాటు మగ్గించాలి. చివరగా కొత్తిమీరను వేసి వడ్డించుకోవాలి.

ఈ వంటకం గురించి

సర్వింగ్ సూచనలు

నాన్, పుల్కా, రోటీ, జీరా రైస్‌తో ఈ మసాల కర్రీ చాలా రుచిగా ఉంటుంది.