తెలంగాణ స్పెషల్ కందదుంప పులుసు
తెలంగాణ వంటల్లో పులుసులకి ప్రత్యేక స్థానం ఉంది. అందులో కందదుంప పులుసు ఒక రుచికరమైన గ్రామీణ వంటకం . చింతపండు పులుపు, మసాలాల ఘాటు, కందదుంప సాఫ్ట్ టెక్స్చర్—అన్ని కలిపి అద్భుతమైన రుచిని ఇస్తాయి. ఈ పులుసు అన్నంతో తింటే చాలా బాగుంటుంది

క్లుప్తంగా

తయారీ విధానం
కందదుంపను ముక్కలుగా చేసుకుని ఉప్పు నీటిలో 5 నిమిషాలు నానపెట్టాలి.
ఆ తరువాత దుంప ముక్కలను ఉడికించాలి. (చాలా మెత్తగా కాకుండా చూసుకోవాలి)
ఇప్పుడు కడాయిలో నూనె వేసి వేడి అయిన తరువాత ఆవాలు, జీలకర్ర, మెంతులు వేయాలి. కొంచెం వేగాక కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించాలి.
ఆ తరువాత ఉల్లిపాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు వేయించాలి. ఇందులో పసుపు వేసి కలిపి, ఉడికించిన కందదుంప ముక్కలు వేసి 10 నిమిషాలు సిమ్‌లో ఉంచాలి.
పడి నిముషాల తరువాత మిర్చి పొడి, ధనియాల పొడి, ఉప్పు, జీలకర మెంతుల పొడి వేసి కలపాలి. అందులోనే చింతపండు రసం, తగినంత నీరు పోసి మరిగించాలి.
పులుసు కావలసినంత చిక్కగా అయిన తరువాత స్టౌ ఆఫ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.
ఈ వంటకం గురించి
సర్వింగ్ సూచనలు
- వేడి అన్నంతో + నెయ్యి → సూపర్ కాంబినేషన్
- రాగి సంగటి తో కూడా బాగుంటుంది.