బీట్‌రూట్ చపాతి రెసిపీ

"బీట్‌రూట్ చపాతి " అందంగా కనిపించే ఈ చపాతీ ఆరోగ్యకరమైనది మరియు తయారు చేయడం సులభం. బీట్‌రూట్ ప్యూరీ పిండికి చక్కని ఎరుపు రంగును ఇస్తుంది.ఇవి పిల్లలకు లేదా ఈ ఆరోగ్యకరమైన కూరగాయను తినడానికి ఇష్టపడని పెద్దలకు సరైనవి. బీట్‌రూట్‌లో చాలా మందికి నచ్చని మట్టి రుచి ఉంటుంది.

బీట్‌రూట్ చపాతి రెసిపీ
తయారీ15 నిమిషాలు
వంట20 నిమిషాలు
మొత్తం సమయం45 నిమిషాలు
ఎంత మందికి4 మందికి
కష్టంసులువు
వంటకానికి వెళ్లండి

వంట మోడ్

బీట్‌రూట్ చపాతి రెసిపీ

దశ 1 / 4

బీట్రూట్ ముక్కలు,పచ్చిమిర్చి,వెల్లుల్లి,అల్లం,చిటికెడు ఉప్పు, కొంచెం నీరు కలిపి ప్యూరిలా గ్రైండ్ చేసుకోవాలి.

కావాల్సిన పదార్థాలు
  • అర కప్పు బీట్‌రూట్ ముక్కలు
  • ఒక కప్పు గోధుమ పిండి
  • 2 పచ్చి మిర్చి
  • 2 వెల్లుల్లి రెబ్బలు
  • చిన్న ముక్క అల్లం
  • తగినంత ఉప్పు
  • తగినంత ఆయిల్

క్లుప్తంగా

బీట్‌రూట్ చపాతి " అందంగా కనిపించే ఈ చపాతీ ఆరోగ్యకరమైనది మరియు తయారు చేయడం సులభం. బీట్‌రూట్ ప్యూరీ పిండికి చక్కని ఎరుపు రంగును ఇస్తుంది.ఇవి పిల్లలకు లేదా ఈ ఆరోగ్యకరమైన కూరగాయను తినడానికి ఇష్టపడని పెద్దలకు సరైనవి. బీట్‌రూట్‌లో చాలా మందికి నచ్చని మట్టి రుచి ఉంటుంది.

తయారీ విధానం

  1. బీట్రూట్ ముక్కలు,పచ్చిమిర్చి,వెల్లుల్లి,అల్లం,చిటికెడు ఉప్పు, కొంచెం నీరు కలిపి ప్యూరిలా గ్రైండ్ చేసుకోవాలి.

  2. వెడల్పాటి గిన్నెలో గోధుమ పిండిని తీసుకుని తగినంత ఉప్పు కలపాలి. తర్వాత గ్రైండ్ చేసిన బీట్‌రూట్ ప్యూరీ వేసి చపాతీ పిండిలా మృదువుగా కలుపుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీరు కలపవచ్చు.

  3. పిండిలో ఒక టీ స్పూన్ నూనె వేసి బాగా కలిపి పది నిమిషాలు మూతపెట్టి పక్కన ఉంచాలి.

  4. పిండిని నిమ్మకాయ పరిమాణంలో ఉండలుగా చేసి చపాతీలుగా వత్తాలి. వేడెక్కిన పెనం పై నూనెతో లేదా నెయ్యితో రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. బంగాళాదుంప కూరతో కానీ పెరుగు చట్నీ తో బాగుంటుంది.