స్వీట్ పొటాటో మల్టీగ్రేన్ డోనట్స్ (చాక్లెట్ గ్లేజ్)
స్వీట్ పొటాటో తీపి + మల్టీగ్రేన్ పోషకాలు = మృదువైన హోమ్‌మేడ్ డోనట్స్ పిల్లలకు ఇష్టమైన, ఆరోగ్యకరమైన ట్రీట్!

క్లుప్తంగా
స్వీట్ పొటాటో తీపి + మల్టీగ్రేన్ పోషకాలు = మృదువైన హోమ్‌మేడ్ డోనట్స్ పిల్లలకు ఇష్టమైన, ఆరోగ్యకరమైన ట్రీట్!
తయారీ విధానం
డోనట్ డో తయారీ: గోరువెచ్చని పాలలో చక్కెర, ఇన్‌స్టంట్ ఈస్ట్ వేసి బాగా కలపాలి.
మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టాలి. ఈస్ట్ బాగా ఉబ్బుతుంది.
ఇప్పుడు ఇందులో మెత్తగా చేసిన స్వీట్ పొటాటో వేసి కలపాలి.
మల్టీగ్రేన్ పిండి, బేకింగ్ సోడా వేసి చపాతీ పిండిలా మెత్తని డోగా కలపాలి.
డోను కప్పి 30 నిమిషాలు పక్కన పెట్టాలి.
డోనట్స్ తయారీ: ఉబ్బిన డోను ½ అంగుళం మందంగా రోల్ చేయాలి.
డోనట్ కట్టర్ లేదా గ్లాస్‌తో డోనట్ ఆకారంలో కట్ చేయాలి.
గ్రీస్ చేసిన ప్లేట్‌లో పెట్టి కొద్దిసేపు ఉంచాలి.
మిడియం మంటపై నూనె వేడి చేసి, డోనట్స్‌ను రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
టిష్యూ పేపర్‌పై పెట్టి అదనపు నూనె తొలగించాలి.
చాక్లెట్ గ్లేజ్ తయారీ: ఒక పాన్‌లో పాలు, చక్కెర, కోకో పౌడర్ వేసి మిడియం మంటపై కలపాలి.
కార్న్ ఫ్లోర్‌ను కొద్దిగా పాలలో కలిపి పాన్‌లో పోయాలి.
వెన్న, ఉప్పు చిటికెడు వేసి మిశ్రమం చిక్కబడే వరకు కలుపుతూ ఉడికించాలి.
మంట ఆపి కొద్దిగా చల్లారనివ్వాలి.
ఈ వంటకం గురించి
డోనట్స్ పేరు వినగానే పిల్లలకు నోరు ఊరుతుంది! చూడగానే తినాలనిపించే ఆకారం, పైగా చాక్లెట్ గ్లేజ్, రంగురంగుల స్ప్రింకిల్స్‌తో ఉండే డోనట్స్ పిల్లలను ఎంతగానో ఆకట్టుకుంటాయి.
సాధారణంగా చేసే డోనట్స్‌కు భిన్నంగా ఆరోగ్యకరంగా చిలగడదుంప (Sweet Potato), మల్టీగ్రెయిన్ పిండితో ఇంట్లోనే డోనట్స్‌ను సులభంగా తయారు చేసుకోవచ్చు. సాయంత్రం స్నాక్‌గా పిల్లలకు అందించడానికి ఇది ఒక మంచి ఎంపిక. మృదువైన, రుచికరమైన డోనట్స్ కి స్వీట్ పొటాటో వల్ల సహజ తీపి, మల్టీగ్రేన్ వల్ల పోషకాలు అందుతాయి.
సర్వ్ చేయడం
వేడి డోనట్స్‌ను చాక్లెట్ గ్లేజ్‌లో ముంచి నట్స్ లేదా స్ప్రింకిల్స్ వేసి సర్వ్ చేయండి.
Nutritional Highlights
- స్వీట్ పొటాటో వల్ల విటమిన్ A & ఫైబర్
- మల్టీగ్రేన్ పిండి వల్ల ఎనర్జీ
- ఇంట్లో తయారీ – ప్రిజర్వేటివ్స్ లేవు
- పిల్లలకు ఎనర్జీ ఇచ్చే హోమ్‌మేడ్ స్నాక్



