శాకాహారంస్వీట్స్

సున్నుండలు – ఆరోగ్యకరమైన సంప్రదాయ స్వీట్

పండగ అంటే సంతోషం… ఆ సంతోషానికి రుచి జోడించేది, ఇంట్లో చేసిన సున్నుండలు సంప్రదాయ రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందించే స్వీట్ ఇది

సున్నుండలు – ఆరోగ్యకరమైన సంప్రదాయ స్వీట్
తయారీ15 నిమిషాలు
వంట20 నిమిషాలు
మొత్తం సమయం35 నిమిషాలు
ఎంత మందికి20 మందికి
కష్టంసులువు
వంటకానికి వెళ్లండి

వంట మోడ్

సున్నుండలు – ఆరోగ్యకరమైన సంప్రదాయ స్వీట్

దశ 1 / 5

మినప పప్పును తక్కువ మంట పై మంచి వాసన వచ్చే వరకు వేయించి పూర్తిగా చల్లారనివ్వాలి.

కావాల్సిన పదార్థాలు
  • అర కేజీ మినప పప్పు
  • పావు కేజీ బెల్లం
  • పావు కేజీ నెయ్యి

క్లుప్తంగా

పండగ అంటే సంతోషం… ఆ సంతోషానికి రుచి జోడించేది, ఇంట్లో చేసిన సున్నుండలు సంప్రదాయ రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందించే స్వీట్ ఇది

తయారీ విధానం

  1. మినప పప్పును తక్కువ మంట పై మంచి వాసన వచ్చే వరకు వేయించి పూర్తిగా చల్లారనివ్వాలి.

  2. చల్లారిన తరువాత మినప పప్పును బరకగా పొడిచేసుకోవాలి.

  3. ఆ పొడిలోనే బెల్లాన్ని చిన్న ముక్కలుగా చేసి వేసి, మళ్లీ గ్రైండ్ చేస్తే సన్నని మిశ్రమం తయారవుతుంది.

  4. నెయ్యిని కొద్దిగా వేడి చేసి మిశ్రమంలో పోసి బాగా కలపాలి.

  5. చేతికి అంటుకోకుండా నిమ్మకాయ పరిమాణంలో ఉండలుగా తయారుచేస్తే సున్నుండలు సిద్ధం